నగరంలోని విద్యానగర్ లో ఓ స్కూల్ వ్యాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ లో ఓ స్కూల్ వ్యాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యానగర్ బస్టాండ్ సమీపంలో శుక్ర వారం ఉదయం బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై వేగంగా వచ్చిన స్కూల్ బస్సు దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న సాయి ప్రకాశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.