సింహంతో ఆటలాడబోయిన వ్యక్తికి రిమాండ్ | man-jumps-into-lion-lounge-in-nehru-zoological-park | Sakshi
Sakshi News home page

సింహంతో ఆటలాడబోయిన వ్యక్తికి రిమాండ్

May 23 2016 12:53 PM | Updated on Sep 4 2018 5:21 PM

నెహ్రూ జూపార్క్‌లో ఆదివారం సాయంత్రం సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి వాటికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన వ్యక్తిపై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: నెహ్రూ జూపార్క్‌లో ఆదివారం సాయంత్రం సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి వాటికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన వ్యక్తిపై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 448 సెక్షన్‌తోపాటు అటవీ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎల్ అండ్‌టీ కంపెనీ ఉద్యోగి ముఖేష్ ఆదివారం స్నేహితులతో కలసి జూపార్క్‌కు రాగా మద్యం మత్తులో అతడు సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దిగిన విషయం తెలిసిందే. జూ సిబ్బంది అప్రమత్తమై అతడ్ని బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement