క్యా బాత్ హై | Kya Baat Hai | Sakshi
Sakshi News home page

క్యా బాత్ హై

Jan 30 2016 12:33 AM | Updated on Mar 29 2019 9:31 PM

క్యా బాత్ హై - Sakshi

క్యా బాత్ హై

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్‌లో అడుగుపెట్టే హక్కు లేదు. తెలంగాణను అడ్డుకునేందుకు ఆయన చేసిన కుట్రల వల్లే

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్‌లో అడుగుపెట్టే హక్కు లేదు. తెలంగాణను అడ్డుకునేందుకు ఆయన చేసిన కుట్రల వల్లే వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?
 - ఐఎస్‌సదన్ ఎన్నికల సభలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
 
 మజ్లిస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీలకు అంతర్గత

  సంబంధాలు చాలా ఉన్నాయి. వీరు ఎలాంటి ఎజెండా లేకుండా ఎన్నికల్లో పోటీకి దిగారు. అభివృద్ధిపై శ్రద్ధలేదు. కేవలం అంతర్గత, స్వార్థ ప్రయోజనాల కోసం ఒక్కటవుతున్న ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి.
 - గౌలిపురా ప్రచార సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
 
 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి టీఆర్‌ఎస్‌కు షాకివ్వాలి. అధికార దుర్వినియోగంతో గ్రేటర్‌పై జెండా ఎగురవేయాలని కలలు కంటున్న టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలి. నగరాభివృద్ధి ఒక్క బీజేపీకే సాధ్యం.
 అడిక్‌మెట్ ప్రచార సభలో బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్

Advertisement
 
Advertisement
Advertisement