మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల | KTR reacted about cancellation of notes | Sakshi
Sakshi News home page

మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల

Nov 13 2016 1:24 AM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల - Sakshi

మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల

‘మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏ బ్యాంకు ముందు చూసినా 500 మంది వరకు ఉంటున్నారు.

రాష్ట్ర రాబడి తగ్గిపోతోంది..
ప్రజలు  కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి
అన్ని రంగాలపైనా ప్రభావం
పీఆర్‌టీయూ-టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ‘మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏ బ్యాంకు ముందు చూసినా 500 మంది వరకు ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అన్ని రంగాలపై పడింది. ప్రజలు కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది’ అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పీఆర్‌టీయూ తెలం గాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. భూములు, నివాస స్థలాల రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయిందన్నారు. ఈ పరిస్థితి తాత్కాలికమా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
రూ.17వేల కోట్ల రుణమాఫీ నాలుగు విడత ల్లో ఇంకా ఓ విడత సొమ్ము బ్యాంక్‌లకు చెల్లిం చాల్సి ఉందన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పీఆర్‌సీ బకాయిల బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వాటన్నిం టినీ దశలవారీగా పరిష్కరిస్తు న్నామని, తాను కూడా వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడతా నన్నారు. పీఆర్‌సీ బకారుుల చెల్లింపు, ఉపాధ్యాయుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యా యుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. అందుకే చైల్డ్ కేర్ లీవ్, పండితులు, పీఈటీ అప్‌గ్రెడేషన్ చేశార న్నారు. అన్నింటికంటే ప్రధానమైన ఉపాధ్యా యుల ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో చర్యలు చేపడుతున్నారని, పరిష్కారం కోసం కేంద్రానికి ఫైలు పంపించారన్నారు.

మరో మూడు ప్రధాన సమస్యలైన పూర్తి స్థాయిలో హెల్త్ కార్డుల అమలు, రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు, పీఆర్‌సీ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిపై సీఎం, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో మాట్లాడానని, వాటి అమలుకు మళ్లీ మాట్లాడతానన్నారని తెలిపారు. వీటిపై ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత తీసుకుం టుందన్నారు.
 
విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలకు కృషి    
ప్రభుత్వం విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేలా కృషి చేస్తోం దన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 16న 2వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్యక్రమంలో పాఠశాల ల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగిం దని, ఇందులో ఉపాధ్యాయులు బాగా పని చేశారన్నారు. ఒకప్పుడు బతకలేక బడిపం తులు అనే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోరుుందన్నారు. కనుక.. ప్రభుత్వ టీచర్లు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడటంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. పీఆర్ టీయూ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, శంబీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement