'ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్నెట్' | KTR assures to sancation of Water, internet facility every home | Sakshi
Sakshi News home page

'ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్నెట్'

Feb 3 2016 4:46 PM | Updated on Sep 3 2017 4:53 PM

'ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్నెట్'

'ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్నెట్'

దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఢిల్లీ: మిషన్ భగీరథలో భాగంగా.. 40 వేల కోట్లతో ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మిషన్ భగీరథ ప్రజెంటేషన్ను కేంద్రమంత్రి వీరేంద్ర సింగ్, ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు అభినందించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్ నాటికి తొలి దశలో 10 నియోజకవర్గాల్లో రక్షిత మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పనుల్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement