Sakshi News home page

హింస బాధ్యత సర్కారుదే!

Published Tue, May 16 2017 1:13 AM

Kodandaram, Chada, Tammineni demand on indira park dharna chowk

స్పష్టం చేసిన ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ
- ప్రభుత్వం అనుకూల, వ్యతిరేక వర్గాలకు ఒకేరోజు అనుమతి ఇచ్చింది
- అనుకూల ధర్నా పేరిట వచ్చింది టీఆర్‌ఎస్‌ శ్రేణులు, మఫ్టీ పోలీసులే
- పోలీసులు దాడిలో 35 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి
- ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసాగించాల్సిందే
- కమిటీ నేతలు కోదండరాం, చాడ, తమ్మినేని డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద సోమవారం జరిగిన హింసకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ అంశంపై అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలకు ఒకే రోజు ప్రభుత్వం అవకాశం కల్పించి రెచ్చ గొట్టిందని మండిపడింది. ధర్నాచౌక్‌ కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వ సానుకూల స్పంద న కోసం వారం పాటు వేచి చూస్తామని.. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. సోమవారం ధర్నాకు ప్రభుత్వం అనుమతినిచ్చి అక్కడే టెంట్లు, కుర్చీలు, మంచినీళ్లు ఏర్పాటు చేసినందున.. అది ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తు న్నట్లు పేర్కొంది.

ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించి, పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన నేతలకు ధన్య వాదా లు తెలిపింది. ధర్నాచౌక్‌ ఘటనపై సోమ వారం సాయంత్రం మగ్దూంభవన్‌లో పరి రక్షణ కమిటీ సమావేశమైంది. ఇందులో చాడ వెంకటరెడ్డి, ఆదిరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీర భద్రం, డీజీ నరసింహారావు (సీపీఎం), కోదండరాం, వెంకటరెడ్డి (టీజేఏసీ), సాది నేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్‌ (న్యూ డెమోక్రసీ–చంద్రన్న), పోటు రంగారావు, రమాదేవి (న్యూడెమోక్రసీ– రాయల), విమ లక్క (అరుణోదయ), రవిచంద్‌ (టీడీఎఫ్‌), నలమాస కృష్ణ (టీపీఎఫ్‌), పీఎల్‌ విశ్వే శ్వరరావు (ఆప్‌), తాండ్రకుమార్‌ (ఎంపీసీఐ– యూ), నరహరి (ఎస్‌యూసీఐ–సీ), కె.సజ య (సామాజిక కార్యకర్త) పాల్గొని చర్చిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ తీరు కుట్ర పూరితం
ధర్నాచౌక్‌ విషయంలో ప్రభుత్వం వ్యవహ రించిన తీరును ఖండిస్తున్నామని చాడ వెంక టరెడ్డి చెప్పారు. తమ ధర్నాకు అనుమతి ఇచ్చి నట్లే ఇచ్చి... అనుకూల ధర్నా పేరిట తమ నిరసనను అణచివేయడానికి కుట్ర పన్నార న్నారు. సీఐ శ్రీదేవి, కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో అనుకూల ధర్నాలో పాల్గొన్నారని, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, కార్యకర్తలు అందు లో చేరి ప్రణాళిక ప్రకారం వ్యవహరించారని చెప్పారు. ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసా గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించడమే సోమవారం నాటి ఘటనకు కారణమని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నాకు అనుమతించాక అక్క డికి చేరుకోవడం తమ హక్కు అని.. దానిని ఉల్లంఘించిన పోలీసులపై చర్య తీసుకోవా లని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ నేతలు అధికార గర్వంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సమాజానికి వారే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఏసీపీ నర్సయ్య స్వయంగా లాఠీ పట్టుకుని కార్యకర్తలను కొట్టారని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు తనను విచక్ష ణారహితంగా కొట్టి, గాయపరిచారని సాది నేని వెంకటేశ్వర రావు తెలిపారు. మహిళలపై మగ పోలీసులు దాడి చేశారని విమలక్క చెప్పారు. అనుకూల ధర్నాకు టెంట్లు, సదు పాయాలు ఎవరు సమకూర్చారో చెప్పాల న్నారు. ధర్నాచౌక్‌తో మార్నింగ్‌ వాకర్స్‌కు ఇబ్బంది లేదని వారి సంఘం కూడా స్పష్టం చేసిందని డా.సుధాకర్‌ వెల్లడించారు.

హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు: కోదండరాం
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, ఐక్యంగా పనిచేస్తామని.. టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. పోలీసులు ధర్నాకు అనుమతిచ్చామని చెప్పి.. నిర సనకారులను గొడ్లను బాదినట్లు బాదా రని మండిపడ్డారు. 35 మందికిపైగా గాయపడ్డారని, అందులో 12 మందికి తలకు దెబ్బలు తగలడంతో పాటు కాళ్లు, చేతులు విరిగాయని వెల్లడించారు. సోమ వారం నుంచి ధర్నాచౌక్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘నాలుకలు కొస్తాం, తలకాయలు తీస్తా మన్న భాషే ప్రభుత్వంలోని వారికి వచ్చి న భాష’ అని విమర్శించారు. ఖమ్మం మిర్చి రైతులపై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించు కోవాలన్నారు.

Advertisement
Advertisement