తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ప్రొ.కోదండరాం బృందం కలిసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ప్రొ.కోదండరాం బృందం కలిసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులపై బుధవారం సీఎస్కు ఓ నివేదికను అందజేసింది. కోదండ రాంతో పాటు పొలిటికల్ జేఏసీ నేతలు రఘు, డీపీ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
అయితే సీఎస్ను కలిసిన అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలన్నారు. ఎకరానికి రూ. 10 వేల పంటనష్టం ఇవ్వాలంటూ కోదండరాం డిమాండ్ చేశారు.