గవర్నర్తో కేసీఆర్ భేటీ | kcr meeting with governor at raj bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్తో కేసీఆర్ భేటీ

Apr 9 2016 6:05 PM | Updated on Aug 15 2018 9:30 PM

గవర్నర్తో కేసీఆర్ భేటీ - Sakshi

గవర్నర్తో కేసీఆర్ భేటీ

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాజ్భవన్లో భేటీ ఆయ్యారు.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రాజ్భవన్లో భేటీ ఆయ్యారు. కేసీఆర్ కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. నూతనంగా టీఆర్ఎస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంతో పాటు ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.  

నూతనంగా ఏర్పాడ్డ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించే అవకాశం కూడా ఉంది. మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ ఇప్పటికే తన సన్నిహితులతో చర్చించారని... దీనికి సంబంధించి కసరత్తు పూర్తిచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రుల తీరుపై వచ్చిన ఫిర్యాదులను, అవినీతి ఆరోపణలను కూడా కేసీఆర్ పరిశీలించినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement