ఎమ్మెల్యే తమ్ముడినంటూ జూ.ఆర్టిస్ట్కు టోకరా | junior artist lakshmi files complaint on man for cheating | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే తమ్ముడినంటూ జూ.ఆర్టిస్ట్కు టోకరా

Jul 22 2014 8:43 AM | Updated on Sep 2 2017 10:42 AM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ్ముడినని నమ్మబలికి ఓ వ్యక్తి ....జూనియర్ ఆర్టిస్ట్కు టోకరా ఇచ్చాడు.

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమ్ముడినని నమ్మబలికి ఓ వ్యక్తి ....జూనియర్ ఆర్టిస్ట్కు టోకరా ఇచ్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.  పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ కు చెందిన విజయ్ కుమార్ కొద్దిరోజులుగా జూబ్లీహిల్స్లోని మాగంటి గోపీనాథ్ కార్యాలయం వద్ద సంచరిస్తూ, ఆయన సోదరుడినని పలువురిని నమ్మించాడు.

 శ్రీకృష్ణనగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మితో విజయ్ కుమార్ కు పరిచయం అయ్యింది. ఎమ్మెల్యేకు చెప్పి తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించాలని లక్ష్మి ఈ సందర్భంగా విజయ్ కుమార్ ను కోరింది. పని చేయిస్తానని అతను ఆమె వద్ద నుంచి రూ.40వేలు తీసుకున్నాడు. అయితే నెల అవుతున్నా లక్ష్మికి అవకాశాలు రాకపోవటంతో సోమవారం ఆమె ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. తనకు విజయ్ కుమార్ పేరుతో తమ్ముడు లేడని చెప్పిన ఎమ్మెల్యే గోపీనాథ్...నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని లక్ష్మికి సూచించారు. దీంతో బాధితురాలు విజయ్ కుమార్ పై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement