
భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు ఆదేశించడం ద్వారా సీఎం కేసీఆర్ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉందని ఆరోపించారు. నయీం కేసులో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.