హరీశ్‌ను జిల్లాలో తిరగనివ్వం: జగ్గారెడ్డి | Jaggareddy comments on harish rao | Sakshi
Sakshi News home page

హరీశ్‌ను జిల్లాలో తిరగనివ్వం: జగ్గారెడ్డి

Jul 26 2016 2:51 AM | Updated on Sep 4 2017 6:14 AM

హరీశ్‌ను జిల్లాలో తిరగనివ్వం: జగ్గారెడ్డి

హరీశ్‌ను జిల్లాలో తిరగనివ్వం: జగ్గారెడ్డి

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై దౌర్జన్యాలు ఆపి, న్యాయం చేయకుంటే మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావును తిరగనివ్వమని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హెచ్చరించారు.

సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై దౌర్జన్యాలు ఆపి, న్యాయం చేయకుంటే మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావును తిరగనివ్వమని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ, ఇతర గ్రామాల వారిని హరీశ్‌రావు మోసం చేస్తున్నారన్నారు.

భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతుంటే.. వారిపై కేసులు పెట్టి, బెదిరించి, కాల్పులు జరిపి భూములను గుంజుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement