తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు, ప్రమోషన్లు


హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతిని సీసీఎస్ డీసీపీగా నియమించారు. ఆయన స్థానంలో ఏఆర్ శ్రీనివాస్ (ఐపీఎస్)ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.నార్త్‌జోన్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.ప్రకాష్‌రెడ్డిని నల్లగొండ జిల్లా ఎస్పీగా నియమించారు. అలాగే, ఐపీఎస్ అధికారి తరుణ్‌జోషిని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా నియమించారు. మెదక్ జిల్లా ఎస్పీగా ఉన్న బి.సుమతి హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా నియమితులయ్యారు.ఆమె స్థానంలో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మెదక్ ఎస్పీగా నియమించారు. మహబూబ్‌నగర్ ఎస్పీగా ఉన్న పి.విశ్వప్రసాద్‌ను నిజామాబాద్ ఎస్పీగా నియమించారు. ఓఎస్‌డీ (క్రైమ్స్)గా ఉన్న ఐపీఎస్ అధికారి బి.నవీన్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా ఎస్పీగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏఎస్పీగా ఉన్న సన్‌ప్రీత్‌సింగ్ శంషాబాద్ డీసీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.♦ నల్లగొండ ఎస్పీగా ఎన్‌ ప్రకాశ్‌రెడ్డి

♦ ఆదిలాబాద్‌ ఎస్పీగా విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌

♦ గ్రేహౌండ్స్‌ గ్రూప్ కమాండర్‌గా తరుణ్‌ జోషి

♦ నార్త్‌ జోన్‌ డీసీపీగా బి.సుమతి

♦ రంగారెడ్డి ఎస్పీగా డి. నవీన్‌కుమార్‌

♦ శంషాబాద్‌ డీసీపీగా సన్‌ప్రీత్‌ సింగ్‌

♦ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఏఆర్‌ శ్రీనివాస్‌

♦ మెదక్‌ ఎస్పీగా చంద్రశేఖర్‌రెడ్డి

♦ నిజామాబాద్‌ ఎస్పీగా విశ్వప్రసాద్‌

♦ హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీగా అకున్‌ సబర్వాల్‌

♦ హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌(ఎస్‌బీ)గా ప్రమోద్‌ కుమార్‌

♦ ఇంటెలిజెన్స్‌ ఐజీలుగా రాజేష్‌కుమార్‌, శివశంకర్‌రెడ్డి

♦ హైదరాబాద్‌ అడిషినల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా సందీప్‌ శాండిల్య

♦ ఐజీస్పోర్ట్స్‌గా వి.వి. శ్రీనివాసరావు

♦ సీఐడీ ఐజీగా ఆర్‌బి నాయక్‌

♦ అడిషినల్‌ కమిషనర్‌ (పరిపాలన)గా పి.మురళీకృష్ణ

♦ అడిషనల్‌ కమిషనర్‌ (సాయుధ బలగాలు‌)గా శివప్రసాద్‌

♦ హైదరాబాద్‌ డీసీపీగా అవినాష్‌ మహంతి

♦ అదనపు డీజీపీలుగా అంజనీ కుమార్‌, రాజీవ్‌రతన్‌లకు ప్రమోషన్‌

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top