బయట పొగుడుతావ్.. లోపల విమర్శిస్తావ్! | inside criticism out Praising | Sakshi
Sakshi News home page

బయట పొగుడుతావ్.. లోపల విమర్శిస్తావ్!

Mar 18 2016 3:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

బయట పొగుడుతావ్.. లోపల విమర్శిస్తావ్! - Sakshi

బయట పొగుడుతావ్.. లోపల విమర్శిస్తావ్!

నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మధ్య కొద్దిసేపున ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మధ్య కొద్దిసేపున ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ప్రశ్నోత్తరాల తర్వాత మీడియా పాయింట్‌కు వెళ్తున్న హరీశ్‌రావుకు లాబీలో సంపత్ ఎదురుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని సంపత్ అభినందించారు.

దీంతో ‘బయటనేమో పొగుడుతవ్.. లోపల మాత్రం విమర్శిస్తవ్’ అంటూ మంత్రి సరదాగా వ్యాఖ్యానించారు. ‘లేదన్నా! బడ్జెట్‌పై చర్చలో మిషన్ కాక తీయ, ప్రాజెక్టుల గురించి పాజిటివ్‌గా మాట్లాడిన, ఎవరినన్నా అడగండి’ అంటూ సంపత్ పేర్కొన్నారు. పక్కనే ఉన్న నిజామాబాద్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కల్పించుకుని ‘ఎక్కడ పొగిడారు’ అంటూ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement