కేసీఆర్ ఎవర్ని చూసి భయపడుతున్నారు? | Indrasena Reddy comments on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ఎవర్ని చూసి భయపడుతున్నారు?

Sep 19 2016 2:41 AM | Updated on Mar 29 2019 9:31 PM

కేసీఆర్ ఎవర్ని చూసి భయపడుతున్నారు? - Sakshi

కేసీఆర్ ఎవర్ని చూసి భయపడుతున్నారు?

సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్..

బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

 సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్.. ఈ రోజు ఎవర్ని చూసి భయపడుతున్నారో టీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేయాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయం టూ చెప్పిన కేసీఆర్‌కు అప్పుడు మతపరమైన అంశం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.

ఆదివారం పార్టీ రాష్ట్రకార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమిత్‌షా సభ విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. తెలంగాణ కోసం మజ్లిస్ ఏనాడూ పోరా టం చేయలేదని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందన్నారు. అలాంటి పార్టీతో లోపాయికారి ఒప్పందా లు చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement