రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం | Indrasena Reddy commented on kcr | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం

Aug 22 2017 2:00 AM | Updated on Aug 15 2018 9:37 PM

రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం - Sakshi

రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం

రైతు ఆత్మహత్యలు నివారించడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.

కేసీఆర్‌పై ఇంద్రసేనారెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌:
రైతు ఆత్మహత్యలు నివారించడంలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులకు భరోసానిచ్చి, అండగా నిలబడుతున్నామనే విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని ఆరోపించారు.

రైతు సమస్యలపై కమిషన్‌ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసి ఏడాది దాటినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ అవార్డు ప్రకటించింది కేంద్రం కాదని.. ఓ ప్రైవేట్‌ విత్తన వ్యాపార సంస్థ అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement