‘పాలమూరు’పై స్వతంత్ర కమిషన్‌ | Independent Commission on 'Palamur' | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’పై స్వతంత్ర కమిషన్‌

May 31 2017 2:03 AM | Updated on Mar 22 2019 3:19 PM

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌) ప్రాజె క్టుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ కీలక ఉత్తర్వులు
 
సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్‌) ప్రాజె క్టుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ చట్ట ఉల్లంఘనలు, ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుతెన్నులు, అటవీ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు తదితర విషయాల్లో నిజా నిజాలను తేల్చేందుకు నిపుణులతో స్వతంత్ర కమిషన్‌ను నియమించింది.

ఎన్‌జీటీ విశ్రాంత సభ్యులు ప్రొఫెసర్‌ యూసెఫ్‌ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిషన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారి, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు, పిటిషనర్‌ సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.ఎస్‌.నంబియార్, పి.ఎస్‌.రావులతో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహా రంలో అంతిమ నిర్ణయానికి రావడానికి  కమిషన్‌ సహాయం తమకు అవసరమని, అందువల్లే పిటిషనర్‌ అభ్యర్థనను ఆమోదిస్తు న్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement