రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. శనివారం నిజామాబాద్‌లో అధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పెరుగుతున్న ఎండ తీవ్రత..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. శనివారం నిజామాబాద్‌లో అధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో మెదక్, ఆదిలాబాద్, భద్రాచలం పట్టణాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఈ పట్టణాల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 39.2 డిగ్రీలు, రామగుండంలో 39, హన్మకొండలో 38 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 39, నల్లగొండ, ఖమ్మంలో 37 డి గ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇప్పటి నుంచి వారానికి ఒక డిగ్రీ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ ప్రకారం గతంలో కంటే ఈ ఏడాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ఎల్‌నినో కారణంగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉంటాయని, అయితే ఇప్పుడే దీన్ని నిర్ధారించలేమన్నారు. ఎండల తీవ్రత వల్ల రానున్న మూడు నెలల్లో అప్పుడప్పుడు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు.
గత పదేళ్లలో మార్చి నెలలో అధికంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు