నేను వెళ్లిపోతున్నాను.. నన్ను క్షమించు | iam going.. please excuse me | Sakshi
Sakshi News home page

నేను వెళ్లిపోతున్నాను.. నన్ను క్షమించు

Aug 18 2015 12:15 PM | Updated on Sep 3 2017 7:37 AM

నేను వెళ్లిపోతున్నాను.. నన్ను క్షమించు

నేను వెళ్లిపోతున్నాను.. నన్ను క్షమించు

మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడలో నివసించే అవుతు పున్నారెడ్డి (28) బ్యాంకు ఉద్యోగి. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఏఎస్‌రావు నగర్‌లోని కరూర్ వైశ్యాబ్యాంకులో పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 6న పున్నారెడ్డి మానసిక స్థితి బాగోలేదని బ్యాంకు అధికారులు విధుల నుంచి తొలగించారు.

దీంతో మనస్తాపానికి గురైన పున్నారెడ్డి నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నన్ను క్షమించు వెళ్లిపోతున్నానంటూ బార్య సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భార్య శ్రీకళ్యాణి తిరిగి ఫోన్ చేయగా స్విచ్‌ ఆఫ్ రావడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement