డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా.. | Woman Bank Employee Filed Police Complaint On Private Company Manager In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇస్తావా.. నేను అడిగింది చేస్తావా..

Jun 21 2025 10:43 AM | Updated on Jun 21 2025 11:40 AM

 Woman bank employee Police complaint on Man

సనత్‌నగర్‌(హైదరాబాద్‌): కోరిక తీర్చాలంటూ మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట శ్యాంలాల్‌ బిల్డింగ్స్‌ ప్రాంతానికి చెందిన మహిళ (26) బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేసి 2023లో మానేసింది. ఆ  సమయంలో ఆమెకు ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న పనీశ్‌ (52) పరిచయమయ్యాడు. ఆమెను తన కూతురిలా భావిస్తున్నానని చెప్పేవాడు. 

అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు. 2024లో మహిళ హైటెక్‌ సిటీలోని మరో బ్యాంకులో పనిలో చేరింది. కాగా ఏప్రిల్‌ 2024 నుంచి మనీష్‌ ప్రవర్తనలో మార్పును బాధితురాలు గుర్తించింది. తరచూ ఆమెకు వాట్సప్‌లో తాను ఇచ్చిన డబ్బు ఇవ్వాలని, లేకుంటే తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. 

అసభ్యకరంగా దూషిస్తూ వాట్సప్‌ సందేశాలు పంపేవాడు. ఆమె పనిచేస్తున్న బ్యాంక్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి బాధితురాలి  గురించి చెడుగా ప్రచారం చేయగా వారు ఆమెను పనిలోకి రావద్దని చెప్పారు. దీంతో బాధితురాలు శనివారం బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పనీ‹Ùపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement