ఉచిత విద్యపై తల్లిదండ్రుల సదస్సు | hyderabad parents association meeting over free education in telangana | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యపై తల్లిదండ్రుల సదస్సు

Nov 7 2016 6:21 PM | Updated on Sep 4 2017 7:28 PM

ఉచిత విద్యపై హైదరాబాద్ జిల్లా తల్లిదండ్రుల సదస్సు మంగళవారం జరగనుంది.

హైదరాబాద్ : ఉచిత విద్య అందరి హక్కు అని హైదరాబాద్ డిస్ట్రిక్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి దశరథ లక్ష్మీ అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరగబోయే ‘హైదరాబాద్ జిల్లా తల్లిదండ్రుల సదస్సు’ పోస్టర్లు, కరపత్రాలను ఆమె కుర్మగూడ డివిజన్ చంద్రయ్యహట్స్ బస్తీలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య హక్కు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఉచిత విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రుల సదస్సు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement