మాదాపూర్ : ప్రముఖ శాస్ర్తవేత్త ఆర్.ఏ.మషేల్కర్‌కు ప్రతిష్టాత్మక వి.కృష్ణమూర్తి విశిష్ట పురస్కారం అందజేసినందుకు తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మాదాపూర్ : ప్రముఖ శాస్ర్తవేత్త ఆర్.ఏ. మషేల్కర్‌కు ప్రతిష్టాత్మక వి. కృష్ణమూర్తి విశిష్ట పురస్కారం అందజేసినందుకు తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. మాదాపూర్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలఫ్‌మెంట్ (సీఓడీ)లో వి. కృష్ణమూర్తి విశిష్ట పురస్కారం అవార్డు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ వి. కృష్ణమూర్తి మహోన్నత వ్యక్తి అని కృషి, పట్టుదలతో పాటు దేశానికి మంచి చేయాలనే తపన ఉంటుందన్నారు. నాణ్యతను పాటించే అన్ని కంపెనీలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
అవార్డు అందుకున్న ప్రముఖ శాస్ర్తవేత్త ఆర్.ఏ. మషేల్కర్ మాట్లాడుతూ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండసీ్ర్టయల్ రిసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా 11 సంవత్సరాల పాటు సేవలందించినట్లు పేర్కొన్నారు.ఆసియా, పసిఫిక్, యూరప్, యూఎస్‌ఏకు చెందిన 60 మందికి పైగా శాస్ర్తవేత్తలు ఒకే చోట పనిచేస్తూ సంబంధిత ప్రభుత్వాల నుండి నిధులు పొందుతున్న గ్లోబల్ రిసెర్చ్ అలయన్Œ్సకు అధ్యక్షులుగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 2050 నాటికి భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వక్ హార్డిట్ గ్రూప్ పౌండర్ చైర్మన్ హబిబ్ ఎఫ్ కోరాకివాలా, సీఓడీ డైరెక్టర్ రమేష్ గెల్లి, సీఓడీ, ప్రొఫెసర్ ఉమేశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు.