కోడి పందాలకు హైకోర్టు బ్రేక్‌! | high court ban on hen-fights and Betting | Sakshi
Sakshi News home page

కోడి పందాలకు హైకోర్టు బ్రేక్‌!

Dec 26 2016 11:16 AM | Updated on Aug 31 2018 8:31 PM

సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది.

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్‌ ఫర్‌ యనిమల్‌ ఆర్గనైజేషన్‌, యనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement