ఎప్పటి లోపు ఖాళీ చేస్తారో చెప్పండి | High court asks for doctor cars when you leave from HMDA | Sakshi
Sakshi News home page

ఎప్పటి లోపు ఖాళీ చేస్తారో చెప్పండి

Nov 24 2016 3:32 AM | Updated on Sep 4 2017 8:55 PM

హెచ్‌ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటి లోపు ఆ స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలని డాక్టర్ కార్స్ ....

డాక్టర్ కార్స్ యాజమాన్యానికి హైకోర్టు స్పష్టీకరణ 

 సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ నుంచి ప్రసాద్ ఐమాక్స్ పక్కన లీజుకు తీసుకున్న స్థలం లీజు గడువు ముగిసిన నేపథ్యంలో ఎప్పటి లోపు ఆ స్థలాన్ని ఖాళీ చేస్తారో చెప్పాలని డాక్టర్ కార్స్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను గురు వారానికి వాయిదా వేసింది. బుధవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సెకెండ్ హ్యాండ్ కార్ల విక్రయం, ప్రదర్శన నిమిత్తం డాక్టర్ కార్స్ యాజమాన్యం 2012లో స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె బకారుులు చెల్లించకపోవడంతో స్థలాన్ని ఖాళీ చేయాలని హెచ్‌ఎండీఏ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులను సవాలు చేస్తూ డాక్టర్ కార్స్ హైకోర్టును ఆశ్రరుుం చగా.. నోటీసులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తర్వాత స్టే ఎత్తివే యాలని కోరుతూ హెచ్‌ఎండీఏ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన స్టేని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ కార్స్ యాజమాన్యం తాజాగా ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement