నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, సోమాజీగూడ, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, కూకట్‌పల్లి, మూసాపేట, మైత్రివనం,సికింద్రాబాద్ ,బోయిన్ పల్లి, బేగంపేట ,ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణ గూడ, హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్, మేడ్చల్, అంబర్‌పేట్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, కొత్తపేట, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
కుండపోత వర్షం పడుతుండటంతో రోడ్లు జలమయం అయ్యాయి. పంజాగుట్ట, మైత్రివనం తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నాలాలను సరిచేస్తున్నారు.