రికార్డు ఎండ.. 40.5 | heavy intensity of sunny in hyd city | Sakshi
Sakshi News home page

రికార్డు ఎండ.. 40.5

Mar 30 2017 1:21 AM | Updated on Oct 16 2018 4:56 PM

రికార్డు ఎండ..  40.5 - Sakshi

రికార్డు ఎండ.. 40.5

ఉగాది పర్వదినం రోజున నగరంలో మండుటెండ సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

సిటీబ్యూరో: ఉగాది పర్వదినం రోజున నగరంలో మండుటెండ సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సీజన్‌లోనే ఇప్పటివరకు అత్యధికంగా బుధవారం గరిష్టంగా 40.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా 23.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 3.6 డిగ్రీలు అధికమని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన వాహనదారులు, పాదచారులు ఎండవేడిమికి విలవిల్లాడారు. ఎండవేడిమికి తోడు ఉత్తర, వాయువ్య దిశల నుంచి నగరంవైపు వీస్తున్న వేడిగాలులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement