బైక్ కుఅడ్డం వచ్చాడని... | he young man poured petrol for two years boy in hyderabad old city | Sakshi
Sakshi News home page

బైక్ కుఅడ్డం వచ్చాడని...

Oct 5 2016 7:31 AM | Updated on Sep 19 2018 8:17 PM

బైక్ కుఅడ్డం వచ్చాడని... - Sakshi

బైక్ కుఅడ్డం వచ్చాడని...

అభంశుభం తెలియని రెండేళ్ల బాలుడు బైక్కు అడ్డం వచ్చాడని అతికిరాతంగా పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు.

హైదరాబాద్: అభంశుభం తెలియని రెండేళ్ల బాలుడు బైక్కు అడ్డం వచ్చాడని అతికిరాతంగా పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. అమానవీయ ఘటన పాతబస్తీ కాలాపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బిలాల్ నగర్ కు చెందిన ఫైజర్ ఖాన్ బైక్ రైడింగ్ చేస్తుండగా ఇద్దరు చిన్నారులు అడ్డుగా వచ్చారు. దీంతో ఆగ్రహంతో తన వద్ద బాటిల్ లో ఉన్న పెట్రోల్ ను ఒక బాలునిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలున్ని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండుకు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement