9 నుంచి నుంచి ఆన్‌లైన్‌లో ఎస్‌ఐ హాల్‌టికెట్లు | Hall tickets to be downloaded for SI exams on April 9 | Sakshi
Sakshi News home page

9 నుంచి నుంచి ఆన్‌లైన్‌లో ఎస్‌ఐ హాల్‌టికెట్లు

Apr 8 2016 5:13 AM | Updated on Sep 17 2018 6:18 PM

సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఐ) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఐ) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు శనివారం నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 9 ఉదయం 8.30 గంటల నుంచి 15 అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ, టెక్నికల్ విభాగాల్లోని 539 పోస్టులకు ఈ నెల 17న పరీక్ష నిర్వహించేందుకు రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు టెక్నికల్ కమ్యూనికేషన్ విభాగం అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, మొబైల్, ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్లను పొందుపరిస్తే హాల్‌టికెట్ వస్తుంది. 040-23150362, 040-23150462 నంబర్లలో support@tslprb.in లో సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement