వడగండ్ల వాన బీభత్సం | hail storm in hyderabad | Sakshi
Sakshi News home page

వడగండ్ల వాన బీభత్సం

Apr 26 2016 4:19 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి.

ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్‌లో పాతబస్తీ, ఎల్బీనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌తో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. మెదక్ జిల్లా దుబ్బకలో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement