శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఓ దుబాయ్ ప్రయాణికుడి వద్ద నుంచి 932 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 29.19 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.