విద్యార్థిని అదృశ్యం | Girl student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం

Jun 23 2016 6:34 PM | Updated on Sep 4 2017 3:13 AM

స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బంజారాహిల్స్ : స్కూల్‌కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే కె.సౌజన్య(12) సమీపంలోని ఎస్‌జీబీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నది.

ఈ నెల 20వ తేదీన ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా రాత్రి గడిచినా రాలేదు. స్వగ్రామం, బంధుమిత్రుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో.. కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement