గాంధీభవన్ లో జీహెచ్ఎంసీ టికెట్ల లొల్లి | ghmc tickets fight in gandhi bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్ లో జీహెచ్ఎంసీ టికెట్ల లొల్లి

Jan 22 2016 3:31 AM | Updated on Sep 3 2017 4:03 PM

గాంధీభవన్ లో జీహెచ్ఎంసీ టికెట్ల లొల్లి

గాంధీభవన్ లో జీహెచ్ఎంసీ టికెట్ల లొల్లి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఆశావహులు కాంగ్రెస్ సీనియర్ నాయకులపై నిరసన గళం వినిపిస్తున్నారు.

భట్టిని నిలదీసిన ఆశావహులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఆశావహులు కాంగ్రెస్ సీనియర్ నాయకులపై నిరసన గళం వినిపిస్తున్నారు. గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కను పలువురు నిలదీశారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన తమకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 తన కుటుంబ సభ్యులకు కుర్మగూడ డివిజన్ టికెట్ ఆశించిన కిశోర్‌గౌడ్ అనే నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అక్కడున్న పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ముందు టికెట్‌ను తనకు ప్రకటించి, ఎలా మారుస్తారని ఫలక్‌నుమా డివిజన్‌కు చెందిన కమలానాయక్ భట్టిని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement