అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు | Gattu Srikanth Reddy commented on trs | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు

Sep 10 2017 2:19 AM | Updated on Sep 17 2017 6:39 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు

సంక్షేమ పథకాలు కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే అందు తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ పథకాలు కేవలం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే అందు తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్‌ చేశారు. దళితుల మూడెకరాల భూపంపిణీ ఒక బూటకంగా మారిందన్నారు.

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన యాలాల పరశురాం, మహంకాళి శ్రీనివాస్‌ అనే ఇద్దరు దళిత యువకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో, సర్కారు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకుల ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement