'మా వాట మాకు ఇవ్వండి' | gadikota srikanth reddy demand water for rayalaseema | Sakshi
Sakshi News home page

'మా వాట మాకు ఇవ్వండి'

Jul 18 2016 1:56 PM | Updated on Sep 27 2018 5:46 PM

'మా వాట మాకు ఇవ్వండి' - Sakshi

'మా వాట మాకు ఇవ్వండి'

విద్యుత్ ఉత్పాదన పేరుతో నీళ్లు దిగువ ప్రాంతాలకు వదలొద్దని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: విద్యుత్ ఉత్పాదన పేరుతో నీళ్లు దిగువ ప్రాంతాలకు వదలొద్దని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు తగ్గకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు సర్కారు నిర్వాకం వల్లే గతేడాది రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయని చెప్పారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు వద్దని, తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుందన్నందున ఈ నీటి విషయంపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని సూచించారు.

ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించి రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి దేవినేని ఉమా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును మూడుసార్లు ప్రారంభించిన ఇప్పటికీ గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలవలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement