దొంగే ‘దొంగా దొంగా’ అని అరచినట్లుంది | Former minister Sailajanath comments on chandrababu | Sakshi
Sakshi News home page

దొంగే ‘దొంగా దొంగా’ అని అరచినట్లుంది

Apr 16 2016 1:32 AM | Updated on Aug 14 2018 11:26 AM

తన పొలంలోకి ఎర్రచందనం దుంగలు ఎలా వచ్చాయో తేల్చని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే దొంగే..

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శ

 సాక్షి, హైదరాబాద్: తన పొలంలోకి ఎర్రచందనం దుంగలు ఎలా వచ్చాయో తేల్చని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే దొంగే.. ‘దొంగా దొంగా’ అని అరిచినట్లుందని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. ఇందిర భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గ్రామంలోని ఆయన తోటలో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను నిల్వ చేశారంటే ఎవ్వరికీ తెలియకుండా జరిగేపనేనా అని ప్రశ్నించారు.

వీటి నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు అధికారుల తీరుపై సీఎం మీడియా ముందు రుసరుసలాడటం విడ్డూరంగా ఉందన్నారు.కాగా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మించబోతున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరగబోతోందని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే నోరు విప్పాలని పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ కె.రవిచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 23న శ్రీశైలం రిజర్వాయర్ వద్ద పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో రైతు చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement