నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
సరూర్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం
May 17 2017 12:50 PM | Updated on Sep 5 2018 9:47 PM
హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. స్థానిక హుడా కాంప్లెక్స్‌లోని వెంకటేశ్వర పారడైస్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Advertisement
Advertisement