జూన్‌ 10 నాటికి రైతు సర్వే పూర్తి | Farmer survey completed by June 10th | Sakshi
Sakshi News home page

జూన్‌ 10 నాటికి రైతు సర్వే పూర్తి

May 28 2017 1:39 AM | Updated on Jun 4 2019 5:04 PM

జూన్‌ 10 నాటికి రైతు సర్వే పూర్తి - Sakshi

జూన్‌ 10 నాటికి రైతు సర్వే పూర్తి

రైతు సమగ్ర సర్వేను జూన్‌ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.

అధికారులకు మంత్రి పోచారం ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమగ్ర సర్వేను జూన్‌ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పోచారం.. అక్కడి నుంచి ప్రతి రోజూ టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడుతున్నారు.

ఏఈవోలు నమోదు చేస్తున్న వివరాలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ప్రతిరోజూ సమీక్షించాలని టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను శనివారం ఆదేశించారు. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ సమగ్ర రైతు సర్వే కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా 100 లైన్ల సామర్థ్యంతో టెలి కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement