'అన్ని బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి' | excise departments raids in hyderabad bars | Sakshi
Sakshi News home page

'అన్ని బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'

Jul 12 2016 9:32 PM | Updated on Jul 11 2019 8:44 PM

చిన్నారి రమ్య ఘటనతో నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తమ దాడులు ముమ్మరం చేశారు.

హైదరాబాద్: చిన్నారి రమ్య ఘటనతో నగరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తమ దాడులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్లోని బార్ అండ్ రెస్టారెంట్లలో ఎక్సైజ్ సీఐ కృపాకర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి సిటీలో బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నామని ఎక్సైజ్ సీఐ కృపాకర్ వెల్లడించారు. 21 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని సీఐ కృపాకర్ సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement