సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ) తరలింపు తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడమే ఇందుక్కారణం.
అమీర్‌పేట, న్యూస్‌లైన్: సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్‌ఐ) తరలింపు తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడమే ఇందుక్కారణం. ఉద్యోగుల ఒత్తిడి మేరకు వచ్చే మార్చి వరకూ ఇక్కడే కొనసాగే అవకాశ ముంది. ఆగస్టు 29 లోపు ఆస్పత్రిని తమకు స్వాధీనం చేయాలని ఈఎస్‌ఐ కార్పొరేషన్ కోరినప్పటికీ, ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ తరలింపు సాధ్యం కాదని మెడికల్ ఇన్సూరెన్స్ డెరైక్టర్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, యూ నియన్ నాయకులతో సమావేశమయ్యారు.
ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు వస్తేనే ఇక్కడి నుంచి నాచారానికి వెళ్తామని వైద్యులు స్పష్టం చేశారు. పిల్లలు స్థానికంగా చదువుకుంటున్నందున పరీక్షలు అయిపోయే వరకూ ఇక్కడే ఆస్పత్రిని కొనసాగిం చేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా డెరైక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రి తరలింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. తరలింపుపై ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అభిప్రాయ సేకరణకు ఓ కమిటీని వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు రావాడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. మంగళవా రం నుంచి నాచారంలో విధులు నిర్వహిం చాలని కొంత మంది అధికారులు చెప్పడాన్ని డెరైక్టర్ తప్పుపట్టారు