జీతాల కోసం ఉద్యోగుల ధర్నా | Employees protest for salaries | Sakshi
Sakshi News home page

జీతాల కోసం ఉద్యోగుల ధర్నా

Oct 3 2016 2:18 PM | Updated on Sep 4 2018 5:24 PM

వేతనాల కోసం జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు.

వేతనాల కోసం జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ సుమారు 70 మంది ఉద్యోగులు బైఠాయించారు. జీతాల్లేక తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement