సిటీబ్యూరో: ఎట్టకేలకు గ్రేటర్లో ‘డబుల్’ ఇళ్ల నిర్మాణానికి రియల్ రంగంలోని బిల్డర్లు ముందుకొస్తున్నారు. నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధిత రంగంలోని బడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో, జీహెచ్ఎంసీలో పేరు నమోదు చేసుకున్న రియల్ రంగంలోని వారికి సైతం టెండర్లలో పాల్గొనేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మునిసిపల్ మంత్రి కేటీఆర్ సైతం రియల్ రంగంలోని బిల్డర్లతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు.
గ్రేటర్లో ఈ సంవత్సరం లక్ష డబుల్ బెడ్రూమ్ఇళ్లు లక్ష్యం కాగా, ఇటీవల జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచిన 12,242 ఇళ్లకు గాను 11,962 ఇళ్లకు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 14 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈ టెండర్లు ఆహ్వానించగా, ఒక చోట ఎవరూ టెండరు దాఖలు చేయలేదు. మరోచోట సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో పడింది. మిగతా 12 ప్రాంతాల్లో 11,962 ఇళ్లకు టెండర్లు ప్రాథమికంగా అర్హత పొందాయి. పూర్తిస్థాయి పరిశీలనానంతరం అర్హులైన వారికి టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ 12 ప్రాంతాల్లోనూ పది ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రియల్ రంగంలోని వారే టెండర్లు దాఖలు చేశారు. మిగతా రెండు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. రియల్ రంగంలోని బిల్డర్ల నుంచి టెండర్లు దాఖలు కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీరు టెండర్లు దాఖలు చేసిన ప్రాంతాల్లో నగర కోర్ ఏరియాతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాలున్నాయి. ఇదిలా ఉండగా న్యూ ఇందిరానగర్‌లో మాత్రం ఎవరూ టెండరు దాఖలు చేయలేదు. నార్సింగి సర్వే నెం. 105కు సంబంధించి సాంకేతిక ఇబ్బందులతో పెండింగ్‌లో ఉంచారు. మురహరిపల్లి, శ్రీరామ్నగర్లలో ఇళ్ల నిర్మాణాలకు పెద్ద కాంట్రాక్టర్లు ముందుకు రాగా, మిగతా అన్ని ప్రాంతాల్లో రియల్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు.
‘డబుల్’కు రియల్టర్లు రెడీ!
Published Sat, May 13 2017 1:03 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement