దిద్దుబాటు | Discarded household survey for voters | Sakshi
Sakshi News home page

దిద్దుబాటు

Nov 5 2015 12:39 AM | Updated on Aug 14 2018 5:56 PM

దిద్దుబాటు - Sakshi

దిద్దుబాటు

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల ఆందోళన, విజ్ఞప్తి మేరకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరుణంలో ఓటర్లకు సంబంధించి ....

తొలగించిన ఓటర్ల కోసం ఇంటింటి సర్వే      బీసీ గణనతోపాటే
పొరపాటున తొలగించి ఉంటే తిరిగి చేర్పు...

 
సిటీబ్యూరో: వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల ఆందోళన, విజ్ఞప్తి మేరకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరుణంలో ఓటర్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరపాటున జాబితాలోంచి తొలగించిన వారి పేర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకుగాను ఇంటింటి సర్వే జరపనున్నారు. ఈనెల 18 వరకు ఈ సర్వే నిర్వహిస్తారు. సర్వేలో భాగంగా బూత్‌లెవెల్ అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు జాబితాలో ఓట్లు తొలగించిన వారు తమ వివరాలను అందజేస్తే తిరిగి నమోదు చేస్తారు.

గ్రేటర్‌లో ఓట్ల తొలగింపుపై పెద్దఎత్తున దుమారం చెలరేగుతుండటం తెలిసిందే. వివిధ రాజకీయపక్షాల ఫిర్యాదుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల కొన్ని బృందాలు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయడంతోపాటు తొలగించిన వారి నుంచి వివరాలు సేకరించారు. రాజకీయపక్షాల నుంచే కాక పత్రికలు, ప్రజల నుంచి కూడా పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తడంతో జాబితాలోంచి తొలగించిన పేర్లను తిరిగి చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement