'నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది' | dattatreya comments on hyderabad city | Sakshi
Sakshi News home page

'నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది'

Jan 24 2016 3:59 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ భిన్న సంస్కృతులతో కూడిన మినీ ఇండియా అని కేంద్రమంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు.

హైదారాబాద్: హైదరాబాద్ భిన్న సంస్కృతులతో కూడిన మినీ ఇండియా అని కేంద్రమంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. శాంతికి నిలయంగా ఉన్న నగరం ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని తెలిపారు. టీడీపీ, బీజేపీ గ్రేటర్ ఉమ్మడి మేనిఫెస్టోను ఆదివారం దత్తాత్రేయ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న మజ్లీస్తో టీఆర్ఎస్ అంటకాగుతోందని విమర్శించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సైతం టీఆర్ఎస్ నీరుగార్చిందని దత్తాత్రేయ ఆరోపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement