క్రి కెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు... | Cricket betting gang arrested | Sakshi
Sakshi News home page

క్రి కెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు...

Jan 6 2016 7:35 PM | Updated on Sep 3 2017 3:12 PM

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.


క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ నరేశ్ తెలిపిన కథనం ప్రకారం.. మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన కుల్దీప్‌సింగ్, షాహినాయత్‌గంజ్‌కు చెందిన చంద్రశేఖర్, కాచిగూడ చప్పల్‌బజార్‌కు చెందిన యశ్‌పాల్‌శర్మ, దూల్‌పేట్‌కు చెందిన టి. అనిల్‌సింగ్‌లు కలిసి మంగళవారం రాత్రి సుల్తాన్‌బజార్‌లోని దిల్‌షాద్‌ప్లాజాలోని ఓ గదిలో అస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లపై సెల్‌పోన్, టీవీల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.19, 100 నగదు, ఒక టీవీ, ఒక సెట్‌టాప్ బాక్స్, పంటర్‌లిస్ట్ కలిగిన నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement