పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ | cpi leader ramakrishna meets pawan kalyan over ap situation | Sakshi
Sakshi News home page

పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ

Dec 1 2016 6:30 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ - Sakshi

పవన్‌తో సీపీఐ నేతల కీలక భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ భేటీకి ఏఐటీయూసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రావు కూడా హాజరయ్యారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు భూ సేకరణ కారణంగా ఉత్పన్నమవుతున్న సమస్యలు, నోట్లరద్దు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించునట్లు జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. భావసారూప్యత కలిగిన ప్రజా సమస్యలపై జనసేన, వామపక్షాలు కలిసి పోరాడే విషయం ఆలోచన చేసినట్లు రామకృష్ణ ప్రకటించారు. ఇది స్నేహపూర్వక భేటీ అని పవన్ పేర్కొన్నారు. సీపీఎం నేతలతో కలిసి మరోసారి పవన్తో భేటీ అవుతామని రామకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement