వైఎస్ మార్గంలో కాంగ్రెస్: టీపీసీసీ | Congress Tribute to YSR | Sakshi
Sakshi News home page

వైఎస్ మార్గంలో కాంగ్రెస్: టీపీసీసీ

Sep 2 2016 7:17 PM | Updated on Mar 18 2019 9:02 PM

దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి చూపించిన మార్గంలోనే కాంగ్రెస్‌పార్టీ నడుస్తున్నదని టీపీసీసీ నివాళిని అర్పించింది.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి చూపించిన మార్గంలోనే కాంగ్రెస్‌పార్టీ నడుస్తున్నదని టీపీసీసీ నివాళిని అర్పించింది. వైఎస్ వర్థంతి సందర్భంగా గాంధీభవన్‌లో శుక్రవారం నివాళులు అర్పించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, మాజీమంత్రి డి.కె.అరుణ, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేతలు మాట్లాడుతూ దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడు, పేదల పట్ల అభిమానం చూపించిన మానవతావాది అని కొనియాడారు. వైఎస్ చూపించిన మార్గంలోనే కాంగ్రెస్‌పార్టీ నడుస్తున్నదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement