కేసీఆర్ సొంత డబ్బుతో చేయించాల్సింది: వీహెచ్
బంగారు కిరీటాన్ని ప్రజల సొమ్ముతో కాకుండా కేసీఆర్ సొంత డబ్బుతో చేయించి ఉండాల్సిందన్నారు వీహెచ్.
హైదరాబాద్: భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన బంగారు కిరీటాన్ని ప్రజల సొమ్ముతో కాకుండా ఆయన సొంత డబ్బుతో చేయించి ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ప్రజల సొమ్మును మొక్కుల కోసం ఎలా ఉపయోగిస్తారు అని వీహెచ్ ప్రశ్నించారు.
కులాల సర్వే చేయించిన కేసీఆర్ ఆ వివరాలను బయటపెట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ ఏర్పాటుతో వెనుకబడిన వర్గాలకు ఒరిగేదేమీ లేదని, జనాభా దామాషా ప్రకారం బీసీల సంక్షేమానికి నిధులివ్వాలన్నారు. అలాగే.. బీసీలకు క్రిమిలేయర్ పరిధిని రూ. 15 లక్షలకు పెంచాలని వీహెచ్ డిమాండ్ చేశారు.