‘జేఈఈలో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ కఠినం’ | chemistry and maths are hard in jee | Sakshi
Sakshi News home page

‘జేఈఈలో కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ కఠినం’

May 21 2018 2:23 AM | Updated on May 21 2018 2:23 AM

chemistry and maths are hard in jee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్‌–1, మాథ్స్‌ పేపర్‌–2లు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన పరీక్షలో పేపర్‌–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే మాథ్స్‌ కాస్త సులువుగా ఉందంటున్నారు.

ఫిజిక్స్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటున్నారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2లో మాథ్స్‌ ప్రశ్నలు కఠినంగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కీ ని ఈ నెల 29 నుంచి అందుబాటులో ఉంచుతామని ఐఐటీ కాన్పూర్‌ తెలిపింది. ఫలితాలు వచ్చేనెల 10న ప్రకటిస్తామని పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement