జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి | chaitanya died in kuntala waterfalls in adilabad district | Sakshi
Sakshi News home page

జలపాతంలో పడి హైదరాబాద్ వ్యక్తి మృతి

Aug 8 2015 3:06 PM | Updated on Sep 3 2017 7:03 AM

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు.

ఆదిలాబాద్(కుంటాల): హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ కుంటాల జలపాతంలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడు గుండ్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని తార్నకకు చెందిన ఊటుకూరి చైతన్య(24), స్నేహితులతో కలసి జలపాతాన్ని చూసేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement