ఇంటి బయట ముగ్గు వేస్తుండగా... | Chain Snatching at Hyderabad medipally | Sakshi
Sakshi News home page

ఇంటి బయట ముగ్గు వేస్తుండగా...

Jun 18 2017 7:05 PM | Updated on Sep 5 2017 1:56 PM

హైదరాబాద్‌లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు.

బోడుప్పల్‌(హైదరాబాద్‌సిటీ): ఇంటి బయట ఊడ్చి ముగ్గు వేస్తున్న ఓ వృద్ధురాలు మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఇద్దరు వ్యక్తులు తెంచుకుని పారిపోయిన సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుద్ధానగర్‌లో జయశ్రీ అనే మహిళ(63) ఆదివారం ఉదయం ఇంటి ముందు ఊడ్చి ముగ్గు వేస్తోంది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు. జయశ్రీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement