కర్మన్‌ఘాట్‌లో చైన్‌ స్నాచింగ్‌ | Chain Snaching in Karmanghat | Sakshi
Sakshi News home page

కర్మన్‌ఘాట్‌లో చైన్‌ స్నాచింగ్‌

Jul 10 2017 2:33 PM | Updated on Sep 5 2017 3:42 PM

నగరంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. సరూర్ నగర్ పీస్ పరిధి కర్మన్ ఘాట్ శుభోదయకాలనిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

హైదరాబాద్: నగరంలో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. సరూర్ నగర్ పీస్ పరిధి కర్మన్ ఘాట్ శుభోదయకాలనిలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. స్వాతి అనే మహిళ స్కూల్లో చదువుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి రోడ్డుపక్కన వెళ్తుండగా పల్సర్‌ బైక్‌ వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యారు. 
 
ఈ క్రమంలో ఆమె కేకలు వేస్తూ దుండగులను నిలువరించేందుకు ప్రయత్నించగా మెడపై స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement